Sun Feb 01 2026 18:37:59 GMT+0000 (Coordinated Universal Time)
Ap Corona : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 220 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 220 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,17,184 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,720 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,97,537 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 4,927 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,30,47,859 నమూనాలను పరీక్షించారు. నమోదయిన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి.
Next Story

