Thu Dec 11 2025 09:16:40 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : చంద్రబాబువి మాయ మాటలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుంది కూటమి ప్రభుత్వం తీరు అని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు పొంతనే లేదని అన్నారు. 15, 651కోట్ల మేర ఛార్జీల వడ్డనకు నియంత్రణ మండలి సర్వం సిద్ధం చేస్తుంటే, బిల్లుల పెంపుపై ప్రజాభిప్రాయానికి ప్రకటన కూడా ఇచ్చేసినప్పటికీ ఇంకా చార్జీలు భారం పడదని చెప్పే చంద్రబాబు మాటలు పాత చింతకాయ పచ్చడితో సమానమని వైఎస్ షర్మిల అన్నారు.
విద్యుత్ ఛార్జీలను...
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఇప్పటికీ అనడం తీవ్ర హాస్యాస్పదమన్న వైఎస్ షర్మిల అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే జనాలకు సర్దుబాటు పేరుతో గుండెపోటు తెప్పించారని విమర్శించారు. 15 వేల కోట్ల మేర ట్రూ అప్ బిల్లులతో జనాల జేబులకు చిల్లులు పెట్టారని, ఇప్పుడు మరో రూ.15 వేల కోట్లకు టైం ఆఫ్ ది డే పేరుతో దోచేందుకు కసరత్తు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. నమ్మి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకు ఏడాదికో హైటెన్షన్ షాక్ పెడుతున్నారన్న షర్మిల లోటు పేరుతో జనాలను బాదడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు.
Next Story

