Sat Dec 06 2025 04:25:34 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గగుడిలో విషాదం.. దైవ దర్శనానికి వచ్చి?
విజయవాడ ఇంద్రకీలాద్రి పై మరో విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి మరో భక్తుడు మృతి చెందాడు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై మరో విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి మరో భక్తుడు మృతి చెందాడు. గుంటూరుకు చెందిన వెంకటేశ్వర్లు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి వెళ్లారు. అయితే క్యూ లైన్ లో ఉండగా వెంకటేశ్వర్లుకు గుండెపోటు వచ్చింది. అక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిన్న కూడా...
నిన్న ఇలాగే హైదరాబాద్ కు చెందిన మూర్తి అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. అతనిని కూడా వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన సంగతి తెలిసిందే. వరసగా దుర్గమ్మ గుడిలో విషాదం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

