Fri Dec 05 2025 14:25:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో పోలీసు కేసు నమోదయింది.

మాజీ మంత్రి కొడాలి నానిపై మరో పోలీసు కేసు నమోదయింది. విశాఖ ట్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంజనా ప్రియ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపర్చే విధంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు.
విశాఖలో నమోదు చేసి...
దీంతో మాజీ మంత్రి కొడాలి నాని పై పోలీసులు కేసు నమోదు చేసి గుడివాడలోని ఆయన ఇంటికి వెళ్లి 41 సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీచేశారు. విచారణకు రావాలని కోరారు. అయితే కొడాలి నాని గుడివాడలో లేకపోవడంతో ఇంటివద్ద ఉన్న నాని మనుషులకు ఆ నోటీసులు అందచేసినట్లు తెలిసింది. మొత్తం మీద కొడాలి నానిపై మరో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
Next Story

