Wed Jan 28 2026 22:37:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీకి మరో షాక్..ఎమ్మెల్సీ రాజీనామా
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు

వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామాలేఖలను శాసనమండలి ఛైర్మన్ కు పంపారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవిని వైఎస్ జగన్ ఇచ్చారు.
ఇప్పటికి ఐదుగురు...
అయితే 2019, 2024 ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ ను ఆశించిన మర్రి రాజశేఖర్ కు చిలకలూరి పేట అసెంబ్లీ టిక్కెట్ జగన్ ఇవ్వలేదు. దీంతో చాలా కాలం నుంచి ఆయన అసంతృప్త నేతగానే ఉన్నారు. చివరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామాలు శాసనమండలి ఛైర్మన్ వద్ద ఉన్నాయి. ఐదో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడంతో వైసీపీకి షాక్ కు తగిలినట్లయింది.
Next Story

