Sat Mar 07 2026 17:59:39 GMT+0530 (India Standard Time)
Breaking : వైసీపీకి మరో ఎంపీ రాజీనామా
వైసీపీకి మరో పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేశారు.

వైసీపీకి మరో పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాలు చేసిన ఎంపీల సంఖ్య ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పెరుగుతుంది. తాజాగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన కనుమూరి రఘురామ కృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు.
ప్రాధమిక సభ్యత్వానికి...
ఎంపీ పదవితో పాటు వైపీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రఘురామ కృష్ణరాజు రాజీనామా చేశారు. గత నాలుగేళ్ల నుంచి వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్ కు వినతి పత్రం కూడా అందించింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరే అవకాశాలున్నాయి.
Next Story

