Fri Nov 08 2024 14:17:02 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : ఏపీలో మరో అల్పపీడనం.. ఎల్లో అలెర్ట్
ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం రానుంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు మరో అల్పపీడనం రానుంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇప్పటికే వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో తుపాను ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఆందోళన మొదలయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23న...
ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది. అందుకే ఎల్లో అలెర్ట్ ను కోస్తా జిల్లాలకు జారీ చేసినట్లు వివరించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Next Story