Amaravathi : అమరావతిలో మరో నలభై వేల ఎకరాల సేకరణకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. మరోసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. మరోసారి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు.అమరావతిలో కీలకమైన టవర్ల నిర్మాణానికి ఏజెన్సీలకు పనులు అప్పగింతకు సీఆర్డీఏ అధారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో జీఏడీ టవర్ తో పాటు టవర్లు 1,2,3,4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో ఎల్ వన్ గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. .జీఏడీ టవర్ పనులను 882 కోట్లకు ఎన్ సీసీ సంస్ధ, హెచ్ఓడీ టవర్లు 1,2 టెండర్లను 1487 కోట్లకు షాపూర్జీ సంస్థ,టవర్లు 3, 4 పనులను ఎల్ అంట్ టీ సంస్థ 1303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం 3673.44 కోట్లతో ఈ టవర్ల నిర్మాణ పనులను త్వరలో ఆయా కంపెనీలు ప్రారంభించనున్నాయి. పరిపాలన అంతా ఒకేచోట జరిగే విధంగా ఈ ఐదు టవర్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

