Sun Mar 15 2026 14:26:45 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి మరో కీలక నేత రాజీనామా
వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇంతియాజ్ ప్రకటించారు

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇంతియాజ్ ప్రకటించారు. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఇంతియాజ్ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఐఏఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సేవాకార్యక్రమాలకు...
అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇంతియాజ్ తెలిపారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటానని ఇంతియాజ్ తెలిపారు. దీంతో ఏపీలో వైసీపీకి మరో నేత రాజీనామా చేసినట్లయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

