Wed Mar 18 2026 18:21:09 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : కౌంటింగ్ కు ముందు తర్వాత హింసాత్మక ఘటనలు జరగొచ్చు.. ఇంటలిజెన్స్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం మరో ఇంటిలిజెన్స్ నివేదిక అధికారులను అప్రమత్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం మరో ఇంటిలిజెన్స్ నివేదిక అధికారులను అప్రమత్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో కౌంటింగ్ కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని తెలిపింది. ప్రధానంగా కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదిక స్పష్టం చేసింది.
అప్రమత్తమయైన అధికారులు...
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడలోని ఏటిమొగ్గ, దమ్ములపేట, రామకృష్ణారావుపేటలపై ప్రత్యేకంగా పోలీసులు ఫోకస్ పెట్టారు. పాతనేరస్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో గొడవలలో పాల్గొన్న వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసు యంత్రాంగం నిర్ణయించింది.
Next Story

