Fri Dec 05 2025 11:28:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో త్వరలో ఎన్నికల నగరా
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మరో ఎన్నికల రణరంగం మొదలు కానుంది.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మరో ఎన్నికల రణరంగం మొదలు కానుంది. ఎన్నికల నగారా మోగనుంది. ఏపీలో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు.
త్వరలో జరగనున్న....
రానున్న సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నిలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని కోరారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. అయితే ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించారు.
Next Story

