Sun Mar 15 2026 23:14:02 GMT+0530 (India Standard Time)
మళ్లీ గడువు పెంచిన రఘురామ కృష్ణరాజు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామాకు మరో గడువు విధించారు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామాకు మరో గడువు విధించారు. మొన్నటి వరకూ ఫిబ్రవరి ఐదోతేదీ వరకూ వైసీపీ నేతలకు గడువు విధించారు. ఈలోగా తనపై అనర్హత వేటు వేయించాలని రఘురామ కృష్ణరాజు సవాల్ విసిరారు. ఈ గడువు ముగియడంతో సోషల్ మీడియాలో వైసీపీ నేతలు రాజీనామా ఎప్పుడు? అంటూ ఆయనను నిలదీస్తున్నారు. దీనికి మరోసారి రఘురామ కృష్ణరాజు సమాధానమిచ్చారు.
అనర్హత వేటు...
తనపై అనర్హత వేటు వేయించడానికి ఈ నెల 11వ తేదీ వరకూ గడువు విధించారు. ఈనెల 11వ తేదీలోపు తనపై అనర్హత వేటు వేయించాలని ఆయన కోరారు. తాను రాజీనామా చేయడం ఖాయమని, రాజీనామాతోనే బుద్ధిచెప్పడానికి వస్తున్నానని రఘురామ కృష్ణరాజు అన్నారు.
Next Story

