Thu Dec 18 2025 23:03:46 GMT+0000 (Coordinated Universal Time)
విడదల రజనీపై మరో కేసు నమోదు
మాజీ మంత్రి విడదల రజనీపై మరో కేసు నమోదయింది

మాజీ మంత్రి విడదల రజనీపై మరో కేసు నమోదయింది. తన ఇంటిపై విడదల రజనీ మరిది గోపి దాడి చేశారని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదుచేశారు. 2022 ఏప్రిల్ నెలలో రజనీ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేశారంటూ ఆయన పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తనను బెదరించారంటూ...
వందలాది మంది రజనీ అనుచరులువచ్చితన ఇంటిపై దాడిచేయడమే కాకుండా ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపిపై ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విడదల రజనీపై ఇప్పటికే ఏసీబీ అధికారులు స్టోన్ క్రషర్ యజమాని నుంచి 2.26 కోట్లు బెదిరించి వసూలు చేశారన్న కేసు నమోదు చేయడం సంగతి తెలిసిందే. ఈ కేసులో రజనీకి హైకోర్టులో ఊరట లభించలేదు.
Next Story

