Mon Dec 08 2025 21:31:06 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : వామ్మో...కృష్ణా, గుంటూరు జిల్లాలకు మళ్లీ రెయిన్ అలెర్ట్
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరో బ్యాడ్ న్యూస్. వాతావరణ శాఖ మళ్లీ భారీ వర్షాలు పడతాయని చెప్పింది

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరో బ్యాడ్ న్యూస్. వాతావరణ శాఖ మళ్లీ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పుడిప్పుడే మొన్నటి వరదల నుంచి విజయవాడ కోలుకుంటుంది. వరద నీరుతగ్గడంతో ప్రజలు ఇళ్లలో నుంచి నాలుగు రోజుల తర్వాత బయటకు వస్తున్నారు. ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు కొందరు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు మరికొందరు పయనమయ్యారు.
భయాందోళనలో ప్రజలు
ఈ సమయంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే వీలయినంత త్వరగా విజయవాడ నుంచి వెళ్లిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకోవాలని భావిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో బయలుదేరి వెళ్లారు. విజయవాడలో మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి. మరోవైపు వాతావరణం పరిస్థితులు సరిగా లేకపోవడంతో చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా రద్దయింది. దీంతో ఆయన ఆహారం, పారిశుద్ధ్యం పంపిణీపై అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.
Next Story

