Fri Jan 30 2026 11:02:48 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో థియేటర్ల ధ్వంసం.. ఎవరి పని?
విజయవాడలోని గవర్నర్ పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు.

విజయవాడలోని గవర్నర్ పేటలోని అన్నపూర్ణ, శకుంతల థియేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. మే 31న అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ లోపలికి ప్రవేశించి నిద్రపోతున్న పనివాళ్లను బెదిరించారు. వారి వద్ద సెల్ఫోన్లను లాక్కుని ఓ గదిలో బంధించారు.
టికెట్ కౌంటర్, క్యాంటీన్, ఆఫీసు రూము, వాష్ రూములను జేసీబీల సాయంతో కూల్చివేశారు. థియేటర్ మేనేజ్మెంట్లో కొందరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం వల్లే ఇదంతా చోటు చేసుకుందని అంటున్నారు. దీనివెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Next Story

