Fri Dec 05 2025 19:56:18 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు అన్నమయ్య జిల్లాలో షర్మిల
నేడు అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు

నేడు అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పీలేరు నియోజక వర్గంలో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. కడప జిల్లా నుంచి ప్రారంభమైన వైఎస్ షర్మిల న్యాయయాత్ర రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది.
మూడు సభల్లో...
చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని ఆమె నిర్వహిస్తూ వెళుతున్నారు. ఈరజు సాయంత్రం 4 గంటలకు మదనపల్లి నియోజక వర్గంలో బహిరంగలో షర్మిల పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాత్రి 7 గంటలకు తంబాలపల్లి నియోజక వర్గంలో బహిరంగ సభలోనూ షర్మిల పాల్గొంటారు.
Next Story

