Thu Jan 29 2026 12:18:51 GMT+0000 (Coordinated Universal Time)
అన్నా క్యాంటిన్ కు నిప్పు
గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటిన్ తగలబడింది. గుర్తు తెలియని వ్యక్తులు అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టారు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ ను మాచర్లలో అమలు పరుస్తున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న బయట వ్యక్తులు మాచర్ల కు రాకుండా పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఇది ఇలా ఉండగానే తెనాలిలో అన్నా క్యాంటిన్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది.
గుర్తు తెలియని వ్యక్తులు...
గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటిన్ తగలబడింది. గుర్తు తెలియని వ్యక్తులు అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. ఈ క్యాంటిన్ గత కొన్నాళ్లుగా మూసి వేసి ఉంది. నిరుపయోగంగా పడి ఉన్న క్యాంటిన్ ను ఎవరు తగలబెట్టారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తుననారు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

