Sun Mar 15 2026 14:07:42 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు కాకినాడకు జగన్.. వైఎస్సార్ పెన్షన్ కానుకను
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పింఛను కనుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పింఛను కనుక పెంపు కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇటీవల పెన్షన్ ను మూడు వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాకినాడలో ప్రారంభించనున్నారు.
బహిరంగ సభలో...
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి కాకినాడకు చేరుకుంటారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మూడు వేల రూపాయలకు పెంచి అమలు చేశామని జగన్ ప్రజలకు చెప్పనున్నారు. తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story

