Fri Dec 05 2025 22:46:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈరోజు రాత్రి ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు బస చేయనున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా కలవనున్నారు. పదిహేను రోజుల వ్యవధిలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చాలా ఆర్ధిక కష్టాల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా ముఖ్యమని కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రం కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రామిస్ లు చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలతో ఏపీకి రావాల్సిన చాలా వాటిని రాబట్టుకోవాలని చూస్తున్నారు.
Next Story

