Fri Mar 27 2026 07:20:21 GMT+0530 (India Standard Time)
Breaking: పవన్ కల్యాణ్ కు నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మూడు పెళ్లిళ్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో కోరింది. మహిళలను ఉద్దేశించి స్టెఫినీ అనే పదం తీవ్ర ఆక్షేపణీయం అని కమిషన్ తన నోటీసుల్లో పేర్కొంది. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలు సమాజం పై ప్రభాావితం చూపుతాయని అభిప్రాయపడింది.
మూడు పెళ్లిళ్లపై...
ఇటీవల తన మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, అయితే వారికి విడాకులిచ్చి, భరణం చెల్లించి చేసుకున్నానని తెలిపారు. మీరు కూడా ముప్పయి పెళ్లిళ్లు చేసుకోవచ్చని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా ఒకరిని పెళ్లి చేసుకుని 30 స్టెఫినీలు మెయిన్టెయిన్ చేయడమేంటని ప్రశ్నించారు. దీనిపై మహిళ కమిషన్ అభ్యంతరం తెలిపింది.
Next Story

