Fri Mar 27 2026 15:13:35 GMT+0530 (India Standard Time)
మేం ట్రేడింగ్ చేయం.. రూలింగ్ చేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ, టీడీపీల పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ, టీడీపీల పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ట్రేడింగ్ చేయమని, రూలింగ్ చేస్తామని చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని, ఖచ్చితంగా 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సోము వీర్రాజు తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ఉద్యమం చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు.
అక్కడ బలపడేందుకు....
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తాము బలపడేందుకు ప్రత్యేక కార్యాచరణ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాను వైసీపీ ప్రభుత్వం ఒ:క నేతకు లీజుకు ఇచ్చిందని, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నుంచి వంద కోట్లు తీసుకుని బెర్త్ లు కేటాయించారని సోము వీర్రాజు ఆరోపించారు. బద్వేలు ఉప ఎన్నిక సక్రమంగా జరిగి ఉంటే తమకు నలభై ఓట్లు పైచిలుకు వచ్చేవని సోము వీర్రాజు తెలిపారు.
- Tags
- bjp
- somu veerraju
Next Story

