Sun Mar 08 2026 02:56:25 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : మళ్లీ ఎనిమిది మందికి నోటీసులు పంపిన స్పీకర్
ఎనిమిది మంది పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు

ఎనిమిది మంది పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన తన ఎదుట హాజరవ్వాలని కోరారు. ఆ యా పార్టీ నుంచి ఇచ్చిన అనర్హత పిటీషన్ పై వివరణ ఇవ్వాలని కోరారు. నిజానికి ఈరోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు చివరి గడువుగా వారం రోజుల క్రితం పంపిన నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీలోగా తమ వివరణలను తమకు పంపాలని ఆ నోటీసుల్లో సూచించారు.
గడువు పూర్తి కావడంతో...
అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ రాలేదు. నేటితో ఆ గడువు ముగియడంతో మరోసారి నోటీసులు పంపారు. 29వ తేదీన తన ఎదుటకు వచ్చి హాజరయి వివరణ ఇవ్వాలని కోరారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుదారులుగా ఉన్న కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్ లకు మళ్లీ నోటీసులు పంపారు.
Next Story

