Fri Dec 05 2025 23:12:01 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. దేశంలో థ్రెట్ ఉన్న వాళ్లందరికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారా?.. అంటూ వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే చంద్రబాబు విలవిలలాడుతారని.. బ్లాక్ కమాండోలను తీసేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి? .. వాళ్లున్నారన్న ధైర్యంతో బాబు మాట్లాడుతున్నారంటూ తమ్మినేని సీతారాం అన్నారు. ఎవరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్ కమాండోలని తమ్మినేని ప్రశ్నించారు.
దేశంలో ఎంతోమందికి బెదిరింపులు వస్తున్నాయని.. చంద్రబాబు ఏమైనా వ్యవస్థలకు అతీతుడా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు బ్లాక్ కమాండోస్ భద్రత తొలగించాలని ఏపీ స్పీకర్గా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు తమ్మినేని. బ్లాక్ కమాండోస్ ఉన్నారనే చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని తమ్మినేని చెప్పుకొచ్చారు. బ్లాక్ కమాండోస్ లేకుండా చంద్రబాబు బయట తిరగగలరా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
News Summary - andhra pradesh speaker tammineni comments on chandrababu naidu security
Next Story

