Fri Dec 05 2025 14:33:26 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : జగన్ కు అయ్యన్న హితవు
వైసీపీ ఎమ్మెల్యేలకు, జగన్ కు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు, జగన్ కు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని, అన్ని విషయాలపై చర్చించాలని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
అసెంబ్లీకి రావాలంటూ...
జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు చేసిన సవాల్ ను ఎక్స్ లో ప్రస్తావించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రజాసమస్యలపై చర్చించడానికి శాసేనసభకు మించిన వేదిక లేదని, వైసీపీ ఎమ్మెల్యులు, జగన్ వచ్చి శాసనసభలో ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించవచ్చని తెలిపారు. అలాగే ప్రజాసమస్యలపై తమ పార్టీ తరుపున ప్రస్తావించవచ్చని కోరారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాట్లాడుతుండటాన్ని తప్పుబట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష హోదా నిబంధనలపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానంటూ ఎక్స్ లో స్పీకర్ పోస్ట్ చేశారు. .
Next Story

