Sat Jan 31 2026 21:35:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కు

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త ధరలను తీసుకుని వచ్చింది. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరగడానికి ముందే కార్యాలయాలకు తాకిడి పెరిగింది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. సర్వర్లు మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. సర్వర్ సమస్యలు, రద్దీ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రాత్రి 11 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం మార్కెట్ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సర్దుబాటు చేస్తారు. సవరించిన విలువలను నిర్దిష్ట తేదీ నుంచి అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆయా ప్రాంతాలను బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
Next Story

