Sat Mar 07 2026 21:37:28 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,344 శాంపిళ్లను

అమరావతి : ఏపీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,344 శాంపిళ్లను పరీక్షించగా.. 39 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా మరణాలు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఏపీలో 444 కరోనా యాక్టివ్ కేసులుండగా.. వారంతా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23,19,367 కరోనా కేసులు నమోదవ్వగా.. 23,04,193 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,730గా ఉంది.
Next Story

