Sat Dec 13 2025 19:29:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ కావాలని అధికారులు సూచించారు. ఈ లోపు సిలబస్ ను కూడా పూర్తి చేయాలని అధ్యాపకులను ఆదేశించారు. ఫిబ్రవరి 23వ తేదీన మొదలై మార్చి 24వ తేదీ వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - I
ఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - II
ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ - I
ఫిబ్రవరి 26న రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ - II
ఫిబ్రవరి 27న మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ - I
ఫిబ్రవరి 28న రెండో సంవత్సరం హిస్టరీ / బోటనీ పేపర్ - II
మార్చి 2న మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ - I
మార్చి 3న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ - IIA / సివిక్స్ - II
మార్చి 5న మొదటి సంవత్సరం జూలాజీ / మ్యాథ్స్ - IB
మార్చి 6న రెండో సంవత్సరం జూలాజీ - II / ఎకనామిక్స్ - II
మార్చి 7న మొదటి సంవత్సరం ఎకనామిక్స్ - I
మార్చి 9న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ - IIB
మార్చి 10న మొదటి సంవత్సరం ఫిజిక్స్ - I
మార్చి 11న రెండో సంవత్సరం ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ - II
మార్చి 12న మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ - I
మార్చి 13న రెండో సంవత్సరం ఫిజిక్స్ - II
మార్చి 14న మొదటి సంవత్సరం సివిక్స్ - I
మార్చి 16న రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ - II
మార్చి 17న మొదటి సంవత్సరం కెమిస్ట్రీ - I
మార్చి 18న రెండో సంవత్సరం కెమిస్ట్రీ - II
మార్చి 20న మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ - I
మార్చి 23న రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ - II
మార్చి 24న మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ - I
Next Story

