Sat Dec 06 2025 17:11:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో అకాల వర్షం.. రైతాంగం ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కురిసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురియడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎటువంటి సూచనలు లేకుండా వర్షం పడటంతో ఆశ్చర్యపోయారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్లలో భారీ వర్షం నమోదయింది. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది.
వరి నూర్పిడుల సమయంలో....
అయితే వరి నూర్పిడుల సమయంలో అకాల వర్షం కురియడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం తడిసిపోవడంతో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటరులోనూ కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలో వర్షం కురియడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
Next Story

