Wed Apr 15 2026 14:47:27 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రాజ్యసభ అభ్యర్థులు ఖరారయినట్లే... కొత్త పేర్లు తెరపైకి?
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే రాజ్యసభ పదవులకు సంబంధించి ఎన్నిక జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే రాజ్యసభ పదవులకు సంబంధించి ఎన్నిక జరగనుంది. త్వరలోనే నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. వీటిని భర్తీ చేయడానికి ఇప్పటి నుంచే మూడు పార్టీలకు చెందిన నాయకులు ఒక నిర్ణయానికి రాగా, ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఈ నాలుగు పదవులను పంచుకోనున్నాయి. బీజేపీ, జనసేనలకు ఒకటి, టీడీపీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. వైసీపీకి 11 స్థానాలే రావడంతో నాలుగు రాజ్యసభ స్థానాలను కూడా కూటమి కైవసం చేసుకోనుంది.
సామాజికవర్గాలే లక్ష్యంగా...
2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ లు పావులు కదుపుతున్నాయి. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి.అభ్యర్దులు దాదాపు ఫిక్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూటమి కే దక్కనున్నాయి. దీంతో.. ఈ నాలుగు సీట్లలో రెండు టీడీపీ, బీజేపీ- జనసేన చెరో సీటు దక్కేలా నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, టిడిపి నుంచి సానా సతీష్ పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. వీరిలో టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో సానా సతీశ్ కు తిరిగి రెన్యువల్ చేయాలని దాదాపు తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది.
ఒక్క సీటు టీడీపీకి...
అంటే టీడీపీకి మరో సీటు దక్కనుంది. ఆ సీటును భారత్ బయోటెక్ సంస్థ అధినేత యల్లా కృష్ణ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ.. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సైతం రేసులో ఉన్నారు. అదే విధంగా బీజేపీ నుంచి ఒక స్థానానికి అవకాశం కల్పించగా..తమిళనాడులో కీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలి ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్న అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి అధినాయకత్వం డిసైడ్ అయి నట్లు ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలోనూ అన్నామలైకు స్థానం దక్కే అవకాశం ఉంది.
కూటమి నేతలకు సంబంధించి...
ఇక జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ను పంపాలని దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. కానీ లింగమనేని విషయంలో టీడీపీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కూటమి నుంచి ఎంపిక చేసే నాలుగు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో జనసేన నుంచి అల్లు అరవింద్ పేరు సైతం ప్రచారంలోకి రావడంతో ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
Next Story

