Thu Apr 09 2026 15:11:09 GMT+0530 (India Standard Time)
పాలిసెట్ పరీక్షలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ పరీక్షలను మేనెల 10న నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు

ఆంధ్రప్రదేశ్లో పాలిసెట్ పరీక్షలను మేనెల 10వ తేదీన నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం పాలిసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంటల వరకూ ఈ పరీక్ష ఉండనుంది.
త్వరలో పూర్తి స్థాయి షెడ్యూల్...
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రవేశ పరీక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ బీసీ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వంద రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 1.50 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
Next Story

