Sun Dec 07 2025 18:02:51 GMT+0000 (Coordinated Universal Time)
Pensions : నేడు ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ
నేడు ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.

నేడు ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. సెప్టంబరు 1వ తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మంది వరకూ వృద్ధులు, వింతతవులు, దివ్యాంగులకు నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల నుంచి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అర్హులైన లబ్దిదారులందరికీ పింఛన్లు పంపీణీ చేస్తుంది.
ఏడు గంటల నుంచి...
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి సిచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారికి అందచేస్తున్నారు.దీనికి సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం ఆయా జిల్లాలకు విడుదల చేయడంతో నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ కార్యక్రమంలో కూటమిలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈరోజు పింఛన్లు అందని వారికి రేపు కూడా పంపిణీ చేసి కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలని అధికారులు ఆదేశించారు.
Next Story

