Tue Mar 10 2026 13:00:47 GMT+0530 (India Standard Time)
శివకాశీలో ఏపీ అధికారులు
శివకాశీలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటిస్తున్నారు.

శివకాశీలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటిస్తున్నారు. శివకాశిలో అగ్నిమాపకశాఖ డీజీ వెంకటరమణ, ఐజీ రవికృష్ణ పర్యటించారు. స్టాండర్డ్ ఫైర్వర్క్స్, ఇతర టపాసుల తయారీ కంపెనీలను బృందం పరిశీలించింది. టపాసుల తయారీ విధానాన్ని అధ్యయనం చేసిన ప్రత్యేక బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. శివకాశీ కంపెనీల స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ అడిగి తెలుసుకున్న అధికారులు, ప్రమాదాలు జరగకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారో అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు.
ప్రమాదాలు జరగకుండా...
కంపెనీల్లో కార్మికులకు శిక్షణ, సర్టిఫైడ్ ఫోర్మెన్లు నియమిస్తున్నట్లు అధికారుల బృందం గుర్తించింది. అగ్నిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించిన అధికారులు, వేట్లపాలెం ప్రమాద ఘటనపై ప్రత్యేక బృందం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వవకాశీలో అధ్యయనం పూర్తయ్యాక ప్రభుత్వానికి నివేదిక అధికారులు ఇవ్వనున్నారు.
Next Story

