Thu Dec 18 2025 18:06:03 GMT+0000 (Coordinated Universal Time)
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
ఏపీలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది

ఏపీలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 16న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే క్యాబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జులై 31 వరకు ఉండడంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
జూన్ 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సారి సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Next Story

