Fri Dec 05 2025 22:44:22 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ బృందం
దక్షిణ కొరియాలో నాలుగో రోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన కొనసాగుతుంది

దక్షిణ కొరియాలో నాలుగో రోజు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన కొనసాగుతుంది. స్మార్ట్ సిటీల నిర్మాణం అధ్యయనం,రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్ పో 2025 ను సందర్శించారు. మంత్రి నారాయణతో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కూడా ఉన్నారు.
పలు కార్యక్రమాలను...
వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఆర్గనైజేషన్,సియోల్ మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగుతున్న ఎక్స్ పో నీ సందర్శించిన మంత్రి నారాయణ ఫ్యూచర్ సిటీస్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ థీమ్ తో జరుగుతున్న ఎక్స్ పో ను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు,60,000 మంది హాజరయ్యారు. భవిష్యత్ స్మార్ట్ సిటీల నిర్మాణం,సుస్థిర ప్రజా జీవనంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,రోబోటిక్ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలని దానిపై ఎక్స్ పో నిర్వహించారు. సిటీ నెట్ సీఈవో చాంగ్ జే బక్ తో సమావేశమైన మంత్రి నారాయణ పర్యావరణహితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధికి ఏపీకి సహకరించాలని కోరారు.
Next Story

