Fri Mar 20 2026 02:10:18 GMT+0530 (India Standard Time)
ఆస్ట్రేలియాలో ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆర్కే రోజాకు అక్కడ తెలుగు సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోని తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఆర్కే రోజా అక్కడ పర్యటనకు వెళ్లారు. రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.
వివిధ కార్యక్రమాల్లో...
అక్కడ వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ లో మంత్రి ఆర్కే రోజాకు తెలుగు సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆమె ఆస్ట్రేలియాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆర్కే రోజా అన్నారు.
Next Story

