Sat Mar 21 2026 20:40:22 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు పై రోజా ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంను జిల్లా చేస్తానని చెప్పడంపై ఆమె ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయారని రోజా ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏటీఎం కార్డులా వాడుకున్నారని రోజా ఘాటు విమర్శలు చేశారు.
పోలవరాన్ని....
పోలవరాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని రోజా తెలిపారు. జగన్ ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వారని, చంద్రబాబు మాట ఇచ్చి మర్చి పోయే వ్యక్తి అని రోజా అన్నారు. చంద్రబాబు ఈసారి తన సొంత నియోజకవర్గంలో గెలవడంపై దృష్టి పెడితే మంచిదని రోజా హితవు పలికారు.
Next Story

