Thu Mar 19 2026 08:38:45 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలచుకుంటే వైసీీపీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండరని ఆయన అన్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్నారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు జగన్ శాడిజాన్ని భరించలేకున్నారన్న ఎన్ఎండీ ఫరూక్ వివాహేతర సంబంధం వల్లే వినుకొండలో రౌడీషీటర్ రషీద్ హత్య జరిగిందని ఆయన తెలిపారు.
హత్యలు జరిగాయంటూ...
టీడీపీ హయాంలో 36 హత్యలు జరిగినట్లు జగన్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. హత్యకు గురైన వారి పేర్లను, జగన్ వెల్లడించాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ డిమాండ్ చేశారు. ప్రజలకు అబద్దాలు చెప్పి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, అయితే దీనిని ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు మాని, సూచనలు చేయాలని ఆయన హితవు పలికారు.
Next Story

