Thu Mar 19 2026 04:11:45 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన నేడు రద్దయింది

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన నేడు రద్దయింది. ఈరోజు అక్కడ జరిగే సభలో లోకేశ్ పాల్గొనాల్సి ఉంది. అయితే నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్, నేపాల్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారిని తీసుకు రావడంపై అధికారులతో చర్చించనున్నారు.
నేపాల్ లో చిక్కుకున్న వారి కోసం...
ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్న మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని మంత్రి నారా లోకేష్ సమీక్షించనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి నారా లోకేష్ ప్రయత్నించనున్నారు.
Next Story

