Fri Mar 20 2026 06:06:47 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు విశాఖకు నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపర్యటనకు రానున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖపర్యటనకు రానున్నారు. ఒక కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యేందుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ నగరానికి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.40 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వెనుక ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్లి బస చేస్తారు.
రేపు కోర్టుకు హాజరై...
27వ తేదీ ఉదయం కోర్టుకు హాజరవుతారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ బయలుదేరి వెళతారు. నారా లోకేష్ దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారి విశాఖకు వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు న్యాయస్థానంలో హాజరయిన అనంతరం తిరిగి విజయవాడకు చేరుకుంటారు.
Next Story

