Fri Dec 12 2025 01:08:20 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ చేసిన అప్పులకు వడ్డీ ఎంత కడుతున్నామో తెలుసా?
రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలిపారు

రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికే తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్న లోకేష్ అందినకాడికి అప్పులు చేశారన్నారు.
గత యాభై ఎనిమిదేళ్లు...
గత యాభై ఎనిమిదేళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా, జగన్ పాలించిన ఐదేళ్ల కాలానికిఅంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరిందని లోకేశ్ తెలిపారు. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు అధికమని లోకేశ్ తెలిపారు. జగన్ ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు.
Next Story

