Mon Dec 08 2025 17:25:56 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు రండి.. పెట్టుబడులు పెట్టండి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. లండన్ లో పర్యటిస్తున్న ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు వల్లే పదిహేను నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని లోకేశ్ తెలిపారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పారు.పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలు సవరిస్తున్నామని అన్నారు.
మూడు ప్రధాన కారణాలు..
ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ నవంబర్ 14, 15తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్ అని, తమకు సుస్థిరమైన నాయకత్వం ఉందని, తమ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదని తెలిపారు.
Next Story

