Fri Dec 05 2025 14:20:17 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : భీమవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. కూటమిని విడగొట్టేందుకు వైసీపీ నేత జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. కూటమి అంటే మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు ఉండవని నారా లోకేష్ అన్నారు. కూటమి పార్టీలు కలసి పనిచేస్తాయని, ఏ ఎన్నికలు వచ్చినా కలసి పోటీ చేస్తాయని తెలిపారు.
ఇక్కడే తనపైనా, పవన్ పైనా...
గతంలో పాదయాత్ర చేసే సమయంలో తనపై ఇక్కడే దాడి జరిగిందని నారా లోకేష్ తెలిపారు. తర్వాత పవన్ కల్యాణ్ పై కూడా ఇక్కడే దాడి జరిగిందన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాలని లోకేష్ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. వైసీపీ పన్నే కుట్రలకు మాత్రం ఎవరూ లోనుకావద్దని ఆయన తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

