Fri Dec 05 2025 12:59:27 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh: ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాల్సిందే
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇన్ ఛార్జి మంత్రులతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇన్ ఛార్జి మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు.ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని కోరారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని లోకేష్ కోరారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవహరించాలని కోరారు.
పట్టభద్రులకు వివరించి...
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా, రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియచేసి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పట్టభద్రులకు తెలియజేయాలని కోరారు. ఏడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు వివరించాలని కోరారు. ఓటర్లను ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
Next Story

