Fri Mar 20 2026 15:38:20 GMT+0530 (India Standard Time)
బాలయ్య బాబు కాదు బాలయ్య తాత : మంత్రి సెటైర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమరనాథ్ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ పై సెటైర్లు వేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమరనాథ్ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ పై సెటైర్లు వేశారు. బాలయ్య బాబు కాదని, బాలయ్య తాత అని అన్నారు. బాలయ్యకు అరవైై ఏళ్లు దాటాయని, తాతను చూడటానికి ఇప్పుడు ఎవరు వస్తారని మంత్రి అమరనాథ్ అన్నారు. బలయ్య కు 60 ఏళ్లు దాటాయి. తాతను చూడటానికి ఎవరు వస్తారని ఆయన ప్రశ్నించారు. నిన్న వీర సింహారెడ్డి ఫంక్షన్ కు అనుకున్నంతగా జనాలు రాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
జనాలు లేకనే...
బాలయ్య ఇప్పుడు సమరసింహారెడ్డి కాదని, వీర సింహారెడ్డి అని మంత్రి అమరనాథ్ తెలిపారు. నిన్న వీర సింహారెడ్డికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనాలు లేకనే చంద్రబాబు, బాలయ్యలు రోడ్లమీద మీటింగ్ లు పెడుతున్నారన్నారు. కాయగూరలు, పల్లీలు కొనడానికి వచ్చిన వాళ్లతో సమావేశాలు పెట్టి జనాలను చంపాలని చూస్తున్నారన్నారు. సెలబ్రిటీలు వస్తే ఆటోమేటిక్ గా జనం వస్తారని, కానీ నిన్న బాలయ్య తాత ఫంక్షన్ కు ఎవరూ రావడం లేదని తెలిపారు.
Next Story

