Fri Jan 30 2026 04:26:24 GMT+0000 (Coordinated Universal Time)
బొత్స కీలక వ్యాఖ్యలు...మూడు రాజధానులపై?
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లుల్లో లోపాలను సవరించి కొత్త బిల్లులతో ముందుకు వస్తామని చెప్పారు. అది ఎప్పుడనేది చెప్పలేమని, త్వరలోనే మూడు రాజధానుల కొత్త బిల్లు అసెంబ్లీకి వస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. విభజన చట్టంలోని హామీలను మాత్రమే అమలు పర్చాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా.....
విజయనగరం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని, కేంద్ర మంత్రులను కలసిన ప్రతిసారీ విభజన చట్లంలోని అంశాలను ప్రస్తావిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించడమే ప్రభుత్వ విధానమని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని ఆయన అన్నారు. హోదా ఉంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ పోరాడుతామని చెప్పారు.
Next Story

