Sun Mar 08 2026 06:16:37 GMT+0530 (India Standard Time)
మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ పీఆర్సీని త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి బాలినేని తెలిపారు.
లోకేష వల్ల....
తెలుగుదేశం పార్టీకి ఇక రాష్ట్రంలో నూకలు చెల్లినట్లేనని మంత్రి బాలినేని అన్నారు. చంద్రబాబు డ్రామాలు ఎవరూ నమ్డం లేదన్నారు. టీడీపీ బతికి బట్టకట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోకి పార్టీ వెళ్లాల్సిందేనని ఆయన చెప్పొకొచ్చారు. లోకేష్ ఎందుకూ పనికిరాడని ఆయన అన్నారు.
Next Story

