Sat Dec 13 2025 22:35:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్న మంత్రి నారాయణ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులపై మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించనున్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించి కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన నిధులు కేటాయింపు,విడుదలపై మంత్రి నారాయణ చర్చించనున్నారు.
మున్సిపల్ శాఖ నిధులతో...
కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, వివిధ మున్సిపల్ ప్రాజెక్టులకు సంబంధించిన వాటిని వెంటనే అనుమతించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు. మున్సిపాలిటీకి రావాల్సిన నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరనున్నారు. మంత్రి నారాయణ తో పాటు మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్తున్నారు.
Next Story

