Mon Apr 13 2026 10:47:05 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీకి చేరుకున్నారు. నారా లోకేశ్ కు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నారా లోకేశ్ కలవనున్నారు. కలసి కృతజ్ఞతలు తెలపనున్నారు.
రాష్ట్రపతిని కలిసి...
అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు మంత్రి నారా లోకేశ్, ఎన్డీఏ ఎంపీలు తెలియజేయనున్నారు. ఇటీవల ఉభయ సభలు ఆమోదించిన అమరావతి చట్టబద్ధత కు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Next Story

