Fri Dec 05 2025 15:54:29 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ స్కామ్ లో స్పీడ్ పెంచిన సిట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం స్పీడ్ పెంచింది. ఇప్పటికే వరస అరెస్ట్ లు చేసిన సిట్ నేడు కూడా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ న్ లను విచారించనునంది. నిన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ లను విచారించిన సిట్ అధికారులు నేడు మరోసారి విచారించేందుకు సిద్ధమయింది. ఇద్దరి ఫోన్లను పరిశీలించింది.
నేడు మరోసారి...
ఇద్దరినీ కలిపి ఒకసారి, విడివిడిగా మరొకసారి విచారణ చేపట్టింది. ఈరోజు మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించడంతో నేడు కూడాధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ లు విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు నేడు రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారుల కస్టడీ లోకి తీసుకోనున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీల అనుమతులపై ఆరా తీయనున్నారు.
Next Story

