Fri Dec 05 2025 16:43:37 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనమండలి సమావేశాలు పది గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాల్సిందీ నిర్ణయిస్తారు. సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుందని సమాచారం. బీఏసీ మీటింగ్ లోనే అజెండాను కూడా ఖరారు చేస్తారు.
బాబు అరెస్ట్ తర్వాత...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్న సమావేశాలు కావడంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. చంద్రబాబు అవినీతిపై అధికార పక్షం, దానికి కౌంటర్ గా విపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే దిశగానే ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాల సందర్భంగా ఎలాంటి నిరసన ప్రదర్శనలను నిర్వహించకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

